NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాలలో ‘బడిబాట’ కార్యక్రమం ఇవాళ నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ మాట్లాడుతూ.. మన ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10% విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.