ELR: దెందులూరు మండలం పోతునూరు శాఖ గ్రంథాలయాన్ని బుధవారం ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తుగా నాగరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. రోజువారి కార్యక్రమాలను, రికార్డులను పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, రిసోర్స్ పర్సన్స్ రిటైర్డ్ ఉద్యోగులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.