KMR: రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో దేశ అభివృద్ధి కోసం చూపిన మార్గం ఆదర్శమని మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. రాజీవ్ గాంధీ చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.