TG: చంద్రబాబును నమ్మొద్దు.. జగన్‌ను నమ్మవచ్చు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్రమంత్రి అమిత్ షా చెప్పినట్లు ప్రొపెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన ఇంఛార్జి నేమూరు శంకర్ గౌడ్ విమర్శించారు. నాగేశ్వరరావు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.