KKD: శంఖవరం మండలం అన్నవరం దేవస్థానంలో గురువారం ఆలయ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ఇంఛార్జ్ ఈవో చక్రధరరావు మాట్లాడారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకు సభ్యులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే, ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు.