సత్యసాయి: హిందూపురం టూ టౌన్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న డ్రైవర్ పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రూ. 10,000 జరిమానా విధించినట్లు సీఐ కరీం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు.