NLG: చండూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోరిమి ఓంకారం ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన ధీశాలిగా కొనియాడారు. 21వ శతాబ్దపు ఆధునిక భారత్ కోసం కృషి చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ ఛైర్మన్ వెంకటరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.