NDL: సున్నిపెంటలో రూ.10 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను గురువారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ఫిల్టర్ హౌస్–చేపల మార్కెట్, కాకుల సెంటర్–బండ్ల బజార్, వైజాగ్ క్యాంప్, ఆసుపత్రి వీధి వరకు నిర్మించిన రహదారులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.