SRD: పటాన్ చెరువు పరిధిలోని పోచారం మీదుగా ప్రవహిస్తున్న నక్క వాగులో మొసలి సంచరించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వాగు తీరంలో మొసలి సంచరిస్తుండటంతో గేదెల, మేకల కాపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి, మొసలిని సురక్షితంగా పట్టుకోవాలని కోరుతున్నారు.