TG: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ప్రకటిస్తామని వెల్లడించారు.