MDCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గౌతమ్‌నగర్ డివిజన్లోని అర్హులైన ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ముస్లిం పెద్దలు చేసిన వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.