CTR: అన్నమయ్య జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ సెక్రెటరీగా పుంగనూరు పట్టణానికి చెందిన మహబూబ్ బాషా (అమ్ము కుట్టి )ను నియమించారు. గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులందాయని ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, MP మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు.