MNCL: బెల్లంపల్లి మండలం సోమగూడెం పంచాయతీ పరిధిలో సింగరేణి రైల్వే ట్రాక్ పనుల మట్టి లారీలను గురువారం గ్రామస్థులు అడ్డుకున్నారు. లారీల వల్ల విపరీతంగా దుమ్ము లేచి ఇళ్లలోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టరతో మాట్లాడి వాటర్ ట్యాంకర్ రప్పించి, రోడ్డుపై నీళ్లు చల్లించడంతో శాంతించారు.