MHBD: జిల్లా ఉపాధికల్పన కార్యాలయంలో రేపు తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు MHBD జిల్లా ఉపాధి కల్పనాధికారి రజిత తెలిపారు. హైదరాబాద్లోని ప్రైవేట్ సంస్థల్లో ఫార్మసిస్ట్, సెక్యూరిటీ గార్డ్, ఆడిట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.