పలు దేశాల్లో ఎబోలా కేసులు పెరుగుతున్న వేళ ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ నుంచి వచ్చే ప్రయాణికులు జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు ఉంటే ఎయిర్పోర్టు ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా ఈ లక్షణాలు కనిపించినా స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని సూచించారు.