NZB: మిర్చి కాంపౌండ్‌కు వెళ్లే దారిలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ పై శాశ్వత పరిష్కారం చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని మార్వాడి గల్లీ, మిర్చి కాంపౌండ్ వద్ద లీకైన పైప్ లైన్‌ను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్‌తో కలిసి పరిశీలించారు.