ప.గో: సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన కలిగొట్ల ఆలయ కమిటీ ఛైర్మన్గా కూసంపూడి సీతారామాంజనేయ రాజుచే ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన కమిటీ ఆలయంలోకి వచ్చే భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచి భక్తి భావాలు పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.