NDL: శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ఈవో శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దర్శనం, తాగునీరు, అన్నప్రసాదం, పారిశుధ్యం వంటి సేవలపై భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చేలా పనిచేయాలని ఆయన సూచించారు. క్యూలైన్లలో తాగునీరు, అల్పాహారం అందుబాటులో ఉండాలని, అన్నప్రసాదాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.