వనపర్తి పట్టణ శివారులోని నరసింగాయపల్లి ఎంసీహెచ్‌ను కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. చిన్నపిల్లల వార్డులో వైద్య సేవలను పరిశీలించారు. అత్యవసర సమయంలో వినియోగించే వెంటిలేటర్ సదుపాయం పనిచేస్తుందో లేదో ఆరా తీశారు. చిన్నపిల్లలకు వెంటిలేటర్ సద్వినియోగం కల్పించాలని ఆదేశించారు.