ATP: మాజీ సీఎం జగన్ ప్రభుత్వంలో రౌడీ మూకలు దళితులపై దాడులకు పాల్పడ్డారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితులపై అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే దళిత వాడల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.