NRML: సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామానికి చెందిన సింగిరెడ్డి భోజవ్వ (55) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. భోజవ్వకు రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో అప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వాకర్ సహాయంతో నడుస్తున్నారు. జీవితం పట్ల విరక్తి చెంది బుధవారం సాయంత్రం స్వర్ణ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.