NDL: అహోబిలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు దేవస్థాన ముఖ్య పరిపాలానాధికారి పార్థసారథి తెలిపారు. గత శనివారం పావన క్షేత్రంలో 3కిలోల తలనీలాలు చోరీకి సంబంధించి అక్కడ ఇన్చార్జ్ గా విధులు నిర్వహిస్తున్న రాంభూపాల్తో పాటు వెంట్రుకల సేకరణ వద్ద విధులు నిర్వహిస్తున్న నరసింహులుపై ఫిర్యాదు రావడంతో విచారించి సస్పెండ్ చేశారు.