TG: HYDలో ఏర్పాటు కానున్న సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా సుమారు 1000 ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ‘రెడీ టు వర్క్ ఫోర్స్’ను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గ్లోబల్ నెట్వర్క్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ సేవలకు HYD అంతర్జాతీయ కేంద్రంగా మారనుందని ఆయన స్పష్టం చేశారు.