AP: గ్రామీణ నీటి సరఫరా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తాగునీటి నాణ్యతతో రాజీపడొద్దని, నెల రోజుల్లో ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ పూర్తి కావాలని ఆదేశించారు. ఈ పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. 3 వేల గ్రామాల్లో తాగునీటి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసిన పవన్.. ఇకపై ప్రతి నెలా తానే స్వయంగా దీనిపై రివ్యూ చేస్తానని చెప్పారు.