KNR: ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని అన్నారు. హుజురాబాద్లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సుహాసిని మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు.