AP: మార్కాపురం జిల్లా వెలిగొండ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. 2026 సీజన్ మొదలయ్యేలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. వెలిగొండ టన్నెల్స్‌లో లైనింగ్ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశారు. వెలిగొండ నిర్వాసితులకు త్వరలోనే R&B బిల్లులు జమ చేస్తామన్నారు.