HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డులో రేపు నిర్వహించబోయే రైతు సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధమైంది. సదస్సుకు విచ్చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా స్థానిక బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభకు హాజరయ్యేందుకు కేటీఆర్ వరంగల్ జిల్లాకు విచ్చేశారు.