TG: రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు ఈ నెల 4, 5 తేదీల్లో మొత్తం 3 సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 93.38 శాతం హాజరయ్యారు.