PLD: నకరికల్లు మండలం దేచవరం చెరువు “జలధార–జలహారతి” కార్యక్రమంతో ఆధునికీకరణకు సిద్ధమవుతోంది. పూడికతీత, కట్టల బలోపేతంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి 131 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందనుందని రైతులు అన్నారు. భూగర్భ జలాలు పెరిగి రెండు పంటలకు భరోసా కలుగుతుందని తెలిపారు. చెరువు కొత్త శోభతో గ్రామంలో సాగు విప్లవాత్మక మార్పులు వస్తాయని రైతులు అభిప్రాయపడ్డారు.