NGKL: జిల్లాలోని మత్స్య సహకార సంఘాల సభ్యులందరూ వెంటనే NFDP (నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి నరసింహరావు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బీమా సౌకర్యం పొందాలంటే నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. ఈనెల 23 వ తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయని వారు ప్రభుత్వ ప్రయోజనాలకు అనర్హులయ్యే అవకాశం ఉందని తెలిపారు.