VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మంగళవారం తెలిపారు. సిబ్బంది సమన్వయంతో జరిగిన ఈ పోటీలు ఐక్యత, స్నేహభావాన్ని పెంచాయని చెప్పారు. నిర్వహణలో రన్-అప్ టీమ్ కృషి ప్రశంసనీయం అని పేర్కొన్నారు. సెనేట్ హాల్లో జరిగిన సమావేశంలో టీమ్ సభ్యులను సత్కరించారు.