MDK: నార్సింగిలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్ గ్రేసీ బాయి, ఈవో నాగభూషణం సూచించారు. 2002లో ఓటు నమోదు చేసుకున్న వివరాలను (నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం సంఖ్య) సేకరించి, ప్రస్తుత నివాస ప్రాంత వివరాలతో సరిచూసుకోవాలని తెలిపారు. ఓటర్లు తమ బూత్ స్థాయి అధికారిని (BLO) సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.