పార్వతీపురం మన్యం జిల్లా మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప వైద్యాధికారి డా. కె.వి.ఎస్ పద్మావతి మంగళవారం సందర్శించారు. గర్భిణీల నమోదు, అందుతున్న వైద్య సేవలు, టీబీ, మలేరియా కేసులు, రక్తహీనత పరిస్థితులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డా. సిహెచ్ వెంకటేష్, సిబ్బంది వినోద్, జె. తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.