NDL: డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవిలో తాగునీటి సౌకర్యం కల్పించడం సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. చలివేంద్రం ద్వారా ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు.