NDL: నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ గౌడన్ ప్రాంగణంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి NMD ఫరూక్తో కలిసి మంగళవారం నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకట రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పార్టీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.