ADB: అగ్ని ప్రమాదం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా భరోసా ఇచ్చారు. మంగళవారం కలెక్టర్ బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో పర్యటించి, అగ్నిప్రమాదంలో దగ్ధమైన జొన్న, మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి, బాధిత రైతుల వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.