NRPT: ఆశాల రెండు నెలల పారితోషికాలు చెల్లించాలని మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో నారాయణపేట, కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ.. మార్చీ, ఏప్రిల్ పారితోషికాలు ఇంతవరకు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని కోరారు.