ASF: రెబ్బెన మండలం గోలేటిలో గజ్జెల్లి అశోక్(35) అనే తాపి మేస్త్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.SI వెంకట కృష్ణ వివరాల ప్రకారం మద్యానికి బానిసైన అశోక్ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇటీవల తల్లి వద్దకు వచ్చి ఉంటున్న అతడు మద్యం తాగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అనుమానం వచ్చి కుటుంబీకులు తలుపు తెరిచి చూడగా ఉరివేసుకుని కనిపించాడు