ASF: కౌటాలలోని రైతు వేదికలో బుధవారం ఉదయం 9 గంటలకు రైతు వారోత్సవాల సభ నిర్వహించనున్నట్లు AO ప్రేమల మంగళవారం తెలిపారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. PACS, సహకార బ్యాంకు ద్వారా లభించే స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.