BDK: టెన్త్ ఫలితాలపై డీఈవో నాగలక్ష్మి మంగళవారం పాల్వంచలో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 12,727 మంది పరీక్షకు హాజరుకాగా 11,506 మంది ఉత్తీర్ణులై 90.58% ఫలితాలు సాధించడం, తక్కువ మార్కులు వచ్చిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలు 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులను సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు.