NRML: జిల్లా తానూర్ మండలంలోని బోంద్రేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో రైతులు షిందే సుదర్శన్, కావేరి, జనార్ధన్లకు చెందిన సుమారు 6 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైంది. అప్పులు చేసి కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.