KDP: కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం క్రాస్ వద్ద మంగళవారం సాయంత్రం గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ పి.రాజా, ఎస్సై జయరాముడు పాల్గొని సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళా భద్రతపై ప్రజలకు వివరించారు. గ్రామాల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించి ప్రశాంత వాతావరణం కాపాడాలని సూచించారు.