ఆసిఫాబాద్ జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ వారియర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలను గుర్తించే విధానాలు, నివారణ చర్యలపై అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం SP నితికా పంత్ వారికి సైబర్ టీ-షర్టులను అందజేసి మాట్లాడారు. ప్రజల్లో సైబర్ భద్రతపై నిరంతరం చైతన్యం కల్పించాలన్నారు.