AKP: ఈ ఏడాది పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎలమంచిలి మండలం జంపపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామానికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులను వారు అభినందించారు.