CTR: చట్ట విరుద్ధ కార్యకలాపాలకు అందరూ దూరంగా ఉండాలని గంగవరం సీఐ రాంభూపాల్ సూచించారు. గంగవరం మండలంలోని మారేడుపల్లిలో పోలీసులు గ్రామ సభ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనుమానాస్పద సంఘటనలపై పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. వివిధ మోసాల నుంచి కాపాడుకోవడంపై అవగాహన కల్పించారు.