JN: బచ్చన్నపేట(M) కొడవటూరు గ్రామంలో అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. మోరం తరలింపునకు ఉపయోగిస్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.ట్రాక్టర్లతో పాటు JCB యజమానులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు.