TPT: నాగలాపురం సురుటపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో కూలింగ్ పెయింట్ వేయించారు. పార్కింగ్ స్థలం నుంచి గోపురం వరకు, అక్కడి నుంచి అన్నదానం భవనం వరకు వెళ్లే మార్గాల్లో భక్తులు కాళ్లు కాలుతున్న సమస్యను గుర్తించిన ఆలయ ఛైర్మన్ డి. పద్మనాభరాజు, ఈఓ పి. లత చర్యలు చేపట్టారు.