KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు ఈ నెల 7వ తేదీ చివరి గడువు అని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రవీంద్రారెడ్డి తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, మెరుగైన వసతులు ఉన్న ఈ కళాశాలలో చేరే అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.