NLG: మిర్యాలగూడలోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ అధికారి ఎం. రుషేంద్రమణి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టాక్ రికార్డులను పరిశీలించి, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కొనుగోలు చేసే ప్రతి విత్తనానికి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అధిక ధరలకు అమ్మే డీలర్ల లైసెన్స్లు రద్దు చేస్తామన్నారు.