HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ను సందర్శించారు. మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు, అధికారులకు సూచించారు.